బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్.. ఘనంగా ప్రారంభం !

బాలయ్య-బోయపాటిలది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా కొద్దిసేపటిక్రితమే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రారంభోత్సవానికి బాలయ్య డిఫరెంట్ గెటప్ లో రావడం ఆకట్టుకుంది.

ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుంది. వచ్చే యేడాది సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మిరియాల రవీంద్రరెడ్డి నిర్మాతగా వ్యవహిరించనున్నారు. బాలయ్యకి జంటగా నటించే హీరోయిన్ ఎవరు ? ఇతర సినిమా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. వాస్తవానికి బోయపాటి-బాలయ్యల హ్యాట్రిక్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే ప్రచారం జరిగింది. ఐతే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ కథని పక్కనపెట్టారు.

బాలయ్య కోసం మరోసారి యాక్షన్ కథని రెడీ చేశాడట బోయపాట. ఈ కథలో యాక్షన్ తో పాటు వినోదం పండేలా చూసుకొన్నారట. ఎప్పటిలాగే ఫ్యామిలీ ఎలిమెంట్స్ బలంగా ఉండబోతున్నాయి. బోయపాటి రాసిన డైలాగ్స్ బాలయ్య నోటితో చెబితే.. అందులో కిక్కు ఉంటుంది. హ్యాట్రిక్ చిత్రంలోనూ కిక్కునిచ్చే డైలాగ్స్ చాలానే ఉండబోతున్నట్టు తెలుస్తొంది. ఇక ఈ సినిమాలో నటి, ఎమ్మెల్యే రోజా విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.