208 ఈజీగా ఛేజ్ చేశారు
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా విండీస్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఈజీగా గెలిచేసింది. విండీస్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు ఉండగనే చేధించింది. 18.4ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 94 నాటౌట్ (50 బంతుల్లో, 6ఫోర్లు, 6సిక్సిలు) ముందుండి విజయాన్ని అందించాడు. కె ఎల్ రాహుల్ (62, 40బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ 18 (9బంతుల్లో 2 సిక్సులు) భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఈ విజయంతో టీమిండియా బ్యాటింగ్ బలమేంటో మరోసారి తెలిసొచ్చింది.
అంతకుముందు విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విన్ లెవిస్(40; 17 బంతుల్లో, 3×4, 4×6), బ్రాండన్ కింగ్(31; 23 బంతుల్లో 3×4, 1×6), హెట్మేయర్(56; 41 బంతుల్లో 2×4, 4×6), కెప్టెన్ పొలార్డ్ (37; 19 బంతుల్లో 1×4, 4×6) రాణించారు. ఆఖర్లో.. జేసన్ హోల్డర్ (24; 9 బంతుల్లో 1×4, 2×6), దినేశ్ రామ్‌దిన్(11; 7 బంతుల్లో 1×4) చెలరేగి ఆడారు.
#INDvsWI
❌
#viratvsWI finally @imVkohli wins…❤️🔥🔥
#INDvWI #ViratKohli #virat #KLRahul #RishabhPant pic.twitter.com/RDulzMZ1pF— Ans Ar (@Ans___Ar) December 6, 2019