అప్పుడు చంపమన్నారు.. ఇప్పుడు అన్యాయంగా చంపేశారు అంటున్నారు.. !

కడుపు కోత ఎవరికైనా ఒక్కటే. దిశ తల్లి కడుపుకోత తీర్చలేనిది. తన కొడుకుని చంపేయండని కోరింది దిశ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ తల్లి, మరో నిందితుడు చెన్నకేశవులు తల్లి కూడా ఇదే మాట చెప్పింది. ఐతే, ఇప్పుడు మాత్రం వీరిద్దరు తమ కొడుకులను కావాలనే చంపేశారని.. దాన్ని దాచిపెడుతూ ఎన్‌‌కౌంటర్‌ జరిగిందని అబద్దాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ ఇద్దరు తల్లుల కడుపుకోతని అర్థం చేసుకోవచ్చు. ఆ బాధతోనే బోరుమంటున్నారు. కానీ, వారి కొడులు చేసి పని క్షమించరానిది. శిక్షంచదగ్గది. వారికి తగిన శిక్షే పడిందని ప్రజలు అంటున్నారు. నిందితులు ఎన్‌‌కౌంటర్‌‌లో మృతి చెందటం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

శుక్రవారం తెల్ల‌వారుజామున గం.3.30 స‌మ‌యంలో దిశ నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులని పోలీసులు  ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పోలీసులని ప్రతి ఘటించి పారిపోయేందుకు యత్నించారు. దీంతో నిందితులని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.