దిశ నిందితుల ఎన్‌కౌంటర్’లో షాకింగ్ నిజాలు
దిశ నిందితులని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ కు సంబంధించిన వివరాలని సీపీ సజ్జనార్ కొద్దిసేపటి క్రితమే మీడియాకు వివరించారు. దిశ కేసులో గత నెల 29వ తేదీననారాయణపేట జిల్లాకు చెందిన ఆరిఫ్, నవీన్, చెన్నకేశవులు, శివలను అరెస్ట్ చేసినట్టుగా సీపీ సజ్జనార్ తెలిపారు. నవంబర్ 30న వారిని రిమాండ్‌కు తరలించామని.. ఈ నెల 3వ తేదీన నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇచ్చినట్టుగా సీపీ తెలిపారు. ఈ నెల 4వ తేదీన నిందితులను చర్లపల్లి జైలు నుండి తమ కస్టడీలోకి తీసుకొన్నామని.. విచారణ చేసే సమయంలో నిందితులు తమకు చాలా విషయాలు చెప్పారని తెలిపారు.
నిందితులు దాచిన వస్తువులను సీజ్ చేసేందుకు శుక్రవారం తెల్లవార్జుజామున చటాన్‌పల్లికి వచ్చామని.. ఆ సమయంలో నిందితులు తమపై దాడికి ప్రయత్నం చేశారని, కాల్పులు కూడా చేశారని సీపీ సజ్జనార్ తెలిపారు. తమ హెచ్చరికలను కూడ నిందితులు వినలేదు, దీంతో తాము జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితులు మృతి చెందినట్టుగా జ్జనార్ తెలిపారు. అంతేకాదు.. ఈ నలుగురు నిందితులు ఈ ఒక్క ఘటనకే పరిమితం కాలేదని.. కర్ణాటక రాష్ట్రంలో కూడ కొన్ని ఘటనల్లో కూడ వీళ్ల పాత్ర ఉందనే అనుమానాలని సజ్జనార్ వ్యక్తం చేశారు. ఇక దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.