శ్రీరెడ్డి డిమాండ్ : పవన్ ని ఉరితీయండి

శుక్రవారం దేశం మొత్తం దిశ నిందితుల ఎన్ కౌంటర్ మూడులోనే ఉంది. ప్రాంతీయ, జాతీయ ఛానెల్స్ అన్నీ దిశ ఎన్ కౌంటర్ పై విశ్లేషణలు, ప్రజాభిప్రాయాలు, కథనాలని ప్రసారం చేశాయి. ఒకరిద్దరు తప్ప యావత్ దేశం దిశ నిందితుల ఎన్ కౌంటర్ ని సమర్థించింది. వివాదాస్పదన నటి శ్రీరెడ్డి మాత్రం ఈ ఎన్ కౌంటర్ ని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి లింకు పెట్టడం విశేషం. దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేసి చంపేసిన తెలంగాణా పోలీసులకు శ్రీరెడ్డి హ్యాట్సాఫ్ చెప్పింది. 

ఈ చావులు తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని తన ఫేస్ బుక్ లో రాసుకొచ్చింది శ్రీరెడ్ది. అదేసమయంలో ఈ ఘటనని పవన్ కు లింక్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ మాదిరి మూడు, నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిని కూడా ఎన్ కౌంటర్  చేసి చంపేయాలని ఏపీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు రాసుకొచ్చింది. దీనిపై సభ్య సమాజం మండిపడుతుంది. సమయం, సందర్భం లేకుండా.. శ్రీరెడ్డి లింకు పెట్టడంపై పవన్ అభిమానులు, సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. 

శ్రీరెడ్ది తీరు ఇలాగే కొనసాగితే.. ఆమెని పిచ్చి దానికింద జమకట్టడం గ్యారెంటీ. ఇక దిశ ఎన్ కౌంటర్ సపోర్ట్ చేసిన వాళ్లలో పవన్ కూడా ఒకరు. ఆయన ముందు నుంచి దిశ నిందితులని ఉరితీయాలని కోరుతున్నారు. కాకపోతే.. అది బహిరంగంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు.