బాలయ్యకు మళ్లీ అదే సమస్య.. !


సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చాన్నాళ్లుగా ఓ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. అదే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది. అదే హీరోయిన్ సమస్య. బాలయ్య కొత్త సినిమా ప్రారంభం అయిందంటే.. చాలు తెరమీదికి హీరోయిన్ సమస్య వచ్చేస్తుంది. వెతికి వెతికి ఆఖరుకి అతికష్టం మీద ఓ హీరోయిన్ ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. శుక్రవారం బాలయ్య-బోయపాటిల హ్యాట్రిక్ చిత్రం ప్రారంభమైన సంగంతి తెలిసిందే. ముహూర్తం షాట్ కోసం ‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పాడు బాలయ్య. అది బాలయ్య అభిమానులకి బాగా నచ్చేసింది.

ఇప్పటికే బోయపాటి పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేశారు. నటీనటుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఒక్క హీరోయిన్ తప్ప. బాలయ్య కోసం మహానటి కీర్తి సురేష్ ని సంప్రదించాడు బోయపాటి. ఆమె ఎస్ గానీ, నో గానీ చెప్పలేదు. ఆమె సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. మహానటి సినిమా తర్వాత కీర్తి వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్యతో అది కూడా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాకి ఆమె ఓకే చెప్పడం దాదాపు జరగదని చెబుతున్నారు. మరీ.. కీర్తి కాకుంటే.. ఇంకెవరు ? అనే చర్చ కూడా జరుగుతోంది. త్రిష, కాజల్ వంటివారిని కూడా పరిశీలిస్తున్నారట. మరీ.. ఫైనల్ గా బాలయ్య హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అవుతారనేది చూడాలి.