హైదరాబాద్ చేరుకున్న NHRC ఇప్పుడేం జరుగుతోంది ?

శుక్రవారం తెల్లవారుజామున దిశ నిందితులని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఐతే, ఇక్కడితో కథ సుఖాంతం కాలేడు. ఎన్‌కౌంటర్ పై తెలంగాణ పోలీసులు NHRC తగిన సమాధానాలు, రుజువులు చూపించాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం హైదరాబాద్ చేరుకుంది. మరికాసేపట్లో ఈ బృందం షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ప్రాంతానికి వెళ్లనుంది.

NHRC బృందం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న నిందితుల మృతదేహాలను పరిశీలించనుంది. ఇప్పటికే మృత దేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అయింది. జ్యూడిషియల్‌లో ఉన్న నిందితులను పోలీస్ కస్టడిలోకి తీసుకున్నారు. కస్టడికి తీసుకున్న తర్వాత ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ కమిషనర్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎం జరిగిందన్నదానిపై నివేదికను తయారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ఆర్‌సీ బృందానికి సహకరించేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక బృందాన్ని సంఘటనా ప్రదేశంలో సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఎన్‌కౌంటర్ కి సంబంధించిన రుజువులని పోలీసులు రెడీగా ఉంచినట్టు సమాచారమ్.