ఖమ్మంలో.. మామ, అల్లుళ్ల సందడి !


విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. బాబీ దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా కథానాయికలు. థమన్ సంగీతం అందించారు. సురేశ్‌ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే వారమే (డిసెంబర్ 13) వెంకీమామ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వెంకీ, చైతూ, పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా స్టేజ్ పై హుశారుగా డ్యాన్స్ చేశారు. సినిమా గురించి వెంకీ, చైతూ.. ఇతర చిత్రబృందం హుషారుగా మాట్లాడారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండీ.. !