సరిలేరు.. అదిరిపోయే అప్ డేట్ ! 

ఒకే ఫ్రేములో సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీలెకెవ్వరు’లో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో పిక్కు, లుక్కు రాలేదు. ఇప్పుడు దానికి ముహూర్తం ఫిక్సయింది. సోమవారం (డిసెంబర్ 9)న సరిలేరు నుంచి ‘సూర్యుడివో.. చంద్రుడివో.. ‘ లిరికల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు.

ఈ సాంగ్ ని మహేష్, విజయశాంతిలపై చిత్రీకరించారు. ఈ పాట అప్ డేటుని ఇస్తూ.. చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్ లో పచ్చ పంటపొలాల్లో మహేష్, ఆయన వెనకాల విజయశాంతి నడుచుకుంటూ వెళ్తున్నారు. పోస్టర్ అదిరిపోయింది. సోమవారం రిలీజ్ కానున్న లిరికల్ వీడియోలో వీరిద్దరిపై బిట్ సీన్స్ కూడా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యడివో.. చండ్రిడివో సాంగ్ కోసం మహేష్ అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. 

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదిస్తున్నారు. అనిల్ సుంకర-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఇప్పటికే సరిలేరు నుంచి మైండ్ బ్లాక్ సాంగ్ వచ్చేసిన సంగతి తెలిసిందే.