మహేష్’తో గంగవ్వ.. ఏం చేసిందంటే ?


యూట్యూబ్‌ సెన్సేష‌న్‌ గంగ‌వ్వ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మై విలేజ్ షో’తో పాపులర్ అయిన గంగవ్వకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ లో మెరిసింది. అంతేకాదు.. గంగవ్వకు ఉన్న క్రేజీ దృష్ట్యా ఆమెతో కలిసి సినిమా ప్రమోషన్స్ ని చేసుకొంటున్నారు. ఓ బేబీ సినిమా సమయంలో సమంతని గంగవ్వ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

సీత సినిమా సమయంలో యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ తో కలిసి అష్టాచెమ్మా ఆడింది గంగవ్వ. కాజల్ తో కలిసి ముచ్చట్లు చెప్పింది. ఇప్పుడు గంగవ్వ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేయనుందా ? లేక మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో గంగవ్వ కనిపించనుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ? గంగవ్వ అండ్ టీమ్ సరిలేరి చిత్రబృందంతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు ఓసారి చూసేయండీ.. !