పునర్నవిని పార్ట్నర్’ని చేసుకున్న రాహుల్

బిగ్ బాస్ 3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ చెప్పిన మాటని నిలబెట్టుకొన్నాడు. పునర్నవిని పార్ట్నర్ ని చేసుకొన్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో రాహుల్-పునర్నవి జంట హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరి రొమాన్స్ ని బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. ఐతే, తాము మంచి స్నేహితులు మాత్రమేనని షో టైమ్ లోనే క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలవడానికి బలమైన కారణం కూడా పునర్నవినే. ఆమెతో రాహుల్ ని చూడ్దానికి ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ వర్జినల్ క్యారెక్టర్ బయటికి తెలిసిసొచ్చింది. అది జనాలకి నచ్చింది. దీంతో.. రాహుల్ కి అత్యధిక ఓట్లు పోలయ్యాయి. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు. షో టైం లోనూ తర్వాత కూడా తన విజయానికి కారణం పునర్నవి అని ఆమెకి క్రెడిట్ ఇచ్చాడు రాహుల్. అంతేకాదు.. తాను చేయబోయే షోస్ ఆమెని పార్ట్నర్ ని చేసుకోబోతున్నట్టు తెలిపారు.
 
ఇప్పుడది చేశాడు. పునర్నవి తో కలిసి స్టేజ్ షో పై దిగిన ఓ అదిరిపోయే పిక్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దానికి తనదైన మార్క్ కామెంట్స్ పెట్టాడు. ఇక బిగ్ బాస్ 3 తర్వాత రాహుల్ కి వరుసగా అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. గాయకుడుగా, నటుడుగా కూడా ఆయనకి అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే రాహుల్ నటనని బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం.