కంగనాతో రాజమౌళి సినిమా ? 

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఉండనుందా ? అంటే..  దానికి అవకాశాలు ఉన్నాయి అంటో బాలీవుడ్ మీడియా. ఎందుకంటే ? ఇటీవల కాలంలో కంగన మొత్తం రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన కథ అందించిన సినిమాల్లో మాత్రమే నటిస్తానని కండీషన్స్ కూడా పెడుతుందట.

‘మణికర్ణిక’ సినిమాకు విజేంద్ర ప్రసాద్ కథని అందించిన సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయ్ గా కంగనా నటనకి ప్రశంసలు దక్కాయి. కంగనా తాజా చిత్రం ‘తలైవి’కి విజేంద్ర ప్రసాద్ నే కథని అందించారు. దివగంత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇటీవలే జయలలితగా కంగనా ఫస్ట్  లుక్ విడుదలైంది.

రామాలయం నేపథ్యంలో ‘అపరాజిత అయోధ్య’ అనే సినిమాని కంగనా చేయనుంది. ఈ సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్నారు. కథల విషయంలో కంగనా.. విజయేంద్ర ప్రసాద్ ని బాగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో విజేంద్రప్రసాద్ అందించిన కథతో ఆయన తనయుడు రాజమౌళి దర్శకత్వంలో కంగనా సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఓ సినిమా  పూర్తయిన తర్వాతే మరో సినిమా ప్రకటన చేసే అలవాటున్న జక్కన్న.. ఆర్ ఆర్ ఆర్ తర్వాతే కొత్త సినిమాని ప్రకటించనున్నారు.