విషాదంలో మెగా ఫ్యామిలీ.. !

మెగా ఫ్యామిలీలో విషాదం నెలకొంది. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని, హైదరాబాద్ చిరంజీవి యువత సంఘం అధ్యక్షుడు నూర్ మహమ్మద్ మృతి చెందారు. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ నూర్ మహమ్మద్ ఆదివారం తుది శ్వాస విడిచారు.


దీంతో మెగా ఫ్యామిలీ హీరోలకి సంబంధించిన అన్నీ సినిమా కార్యక్రమాలు రద్దయ్యాయి. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ టీజర్ అప్ డేట్ ఇవాళ రావాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేశారు.

నూర్ మహమ్మద్ ని మెగా ఫ్యామిలీ తమ సొంత మనిషిగా భావించేవారు. ఇంట్లో వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉన్న మెగా ఫ్యామిలీ అన్నీ కార్యక్రమాలని క్యాన్సిల్ చేసుకొంది. రామ్ చరణ్ ఆసుపత్రికి వెళ్లి నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులకి పరామర్శించారు.


అల్లు అర్జున్ నూర్ ఇంటికి వెళ్లి నూర్ కటుంబ సభ్యులని పరామర్శించారు. నూర్ అత్యక్రియలకి మెగా హీరోలు అందరూ హాజరుకాబోటున్నట్టు తెలుస్తోంది. ఇక మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక నూర్ భాయ్ కి సంతాపం తెలియజేస్తున్నారు.