అల.. టీజర్ డేటు వచ్చేసింది !

ఆదివారమే రావాల్సిన ‘అల.. వైకుంఠపురంలో’ టీజర్ రిలీజ్ అప్ డేట్ మెగా ఫ్యామిలీ వీరాభిమాని నూర్ భాయ్ మృతితో వాయిదా పడిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని నూర్ భాయ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులని ఓదర్చారు. నూర్ భాయ్ కుటుంబాన్ని ఆదుకుంటామని మెగాస్టార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అభిమాని మృతితో మెగా ఫ్యామిలీ కదలిరావడం.. ముందు నిలబడటంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఈ విషయం పక్కనపెడితే.. ఆదివారం వాయిదాపడిన టీజర్ అప్ డేటు ఇవాళ వచ్చేసింది. టీజర్ అప్ డేటుకి సంబంధించిన పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 11న అంటే బుధవారం టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అంతకంటే ముందే.. ఈ రోజు సాయంత్రం 4:05గంటలకి #Teaserglimpse ని విడుదల చేయనున్నారు.

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ లకి మంచి పాత్రలు దక్కాయని చిత్రబృందం చెబుతోంది. అంతేకాదు.. అల.. టీజర్ లో పవన్ వాయిస్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. థమన్ సంగీతం అందించారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 అల.. ప్రేక్షకుల ముందుకురానుంది.