సరిలేరు పాట.. సాగిందిలా.. !
సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాలు దసరాకే ప్రారంభమైన సంగతి తెలిసిందే. దసరా, దీపావళీ సీజన్ లో సంక్రాంతి సినిమాలు అల.. వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు పోటాపోటీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించాయి. కాస్త గ్యాప్ తీసుకొని తాజాగా మరోసారి ప్రమోషన్స్ లో స్పీడు పెంచాయి.
ఈ క్రమంలో సరిలేరు నుంచి వారానికో సాంగ్ క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం సరిలేరు నుంచి ‘సూర్యుడివో.. చంద్రుడివో… ‘ రాబోతుంది. ఈ సాయత్రం సాంగ్ రిలీజ్ కి ముహూర్తం. ఈ సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతిపై పచ్చటి పొలాల మధ్య చిత్రీకరించారు. దానికి సంబంధించిన స్టిల్స్ రెండు, మూడు రోజుల నుంచే క్యూ కడుతున్నాయి. వాటిని చూసి మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు.
ఇక సాయంత్రం రాబోతున్న సూర్యుడివో.. చంద్రదివో సాంగ్ కి సంబంధించిన పల్లవిని దర్శకుడు అనిల్ సుంకర తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో…
సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో.
విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో…
సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో…” అంటూ సరిలేరు పాట సాగింది.
మరికొద్ది గంటల్లో పూర్తి సాంగ్ ని వినబోతున్నాం. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటించారు. దాదాపు 13యేళ్ల తర్వాత లేడీ సూపర్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో…
సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో.విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో…
సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో…"@thisisdsp sir.. brilliant tune @ramjowrites garu… Meaningful lyrics 🙏🙏👏👏… pic.twitter.com/oGOorINiXM
— Anil Ravipudi (@AnilRavipudi) December 9, 2019