అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ వైఫై వాయిస్ కాల్స్


ఇకపై ఇంటర్నెట్ ఉంటే అన్నీ పనులు చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్ తో సహా. తాజాగా ఎయిర్ టెల్ వైఫై వాయిస్ కాల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతగా ఢిల్లీలోని కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. అక్కడ విజయవంతం అయితే.. దేశ వ్యాప్తంగా వైఫై వాయిస్ కాల్స్ ని అందుబాటులోనికి తీసుకురానుంది.

సాధారణ వాయిస్ కాల్స్ మాదిరిగానే ఈ వైఫై కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్స్ కు చెందిన 2జి, 3జి, 4జి, వీవోఎల్టీఈ, వైఫై వినియోగదారులకు కూడా కాల్స్ చేయవచ్చు. ఎయిర్ టెల్ వినియోగదారులు రోమింగ్ సమయంలో కూడా వై-ఫై కాల్స్ చేసుకోవచ్చని, దీని కోసం కొత్త సిమ్ కార్డులను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఐతే, ప్రస్తుతానికి మాత్రం అంతర్జాతీయ కాల్స్ ను అనుమతించడం లేదని తెలిపింది.