దిశ నిందితుల ఎన్ కౌంటర్’పై సీబీఐ దర్యాప్తు ?

దిశ నిందితుల ఎన్ కౌంటర్’పై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని సమాచారమ్. మరణించిన నిందితుల్లో ఇద్దరు మైనర్లేనని ప్రచారం జరుగుతోంది. వారి టెన్త్ క్లాస్ మెమోలోని పుట్టినతేదీ ప్రకారం వారు మైనర్లో కాదో గుర్తిస్తారి. ఒకవేళ వారిద్దరూ మైనర్లేనని తేలితే తెలంగాణ పోలీసులకు తిప్పలు తప్పవని అంటున్నారు. ఇక దిశ ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందన కూడా సీఎం కేసీఆర్ కి తిప్పలు తెచ్చిపెట్టేలా ఉందని చెప్పుకొంటున్నారు.

దిశ ఎన్ కౌంటర్’పై స్పందించిన సీఎం జగన్.. తెలంగాణ పోలీసులకి హ్యాట్సాప్ చెప్పిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగినట్టు జగన్ మాటలని బట్టీ అర్థమవుతోంది. ఇప్పుడిదే సీఎం కేసీఆర్ ని, తెలంగాణ పోలీసులని ఇబ్బందులకి గురిచేసేలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే దిశ నిందితుల ఎన్ కౌంటర్’పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే.