ఫిల్మ్ చాంబర్ వద్ద హీరో ఆత్మాహత్యా యత్నం
హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిల్మ్ వద్ద హీరో ఆత్మహత్యాయత్నం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. తన సినిమా రిలీజ్ కి ముందే లీక్ కావడమే ఇందుకు కారణమని సదరు హీరో తెలిపారు. వివరాల్లోకి వెఌతే… కొత్త కుర్రాడు దురగాప్రసాద్ హీరోగా ‘నాని గాడు’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సీపీ రెడ్డి దర్శకుడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉన్న ‘నాని గాడు’ సినిమాని ఎవరో యూట్యూబ్ లో లీక్ చేశారు. దాదాపు రూ. 40లక్షల తెరకెక్కించిన సినిమా లీక్ కావడంతో చిత్రబృందం షాక్ కి గురైంది. ఫిల్మ్ చాంబర్ కి చేరుకున్న చిత్రబృందం ఆందోళనకి దిగింది. హీరో దుర్గా ప్రసాద్ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు.
ఈ లీక్ పై పోలీసులకి ఫిర్యాదు చేస్తామని.. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. రేపు ఫిల్మ్ చాంబర్ ఎదురుగానే ఆత్మహత్య చేసుకుంటానని హీరో దుర్గా ప్రసాద్ హెచ్చరించారు. యూట్యూబ్ లింక్ ను వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని చిత్ర యూనిట్ కోరుతోంది. స్టార్ హీరోల సినిమాలు ఆన్ లైన్ లో లీకైన సందర్భాలున్నాయి. కానీ, ఇలా నేరుగా యూట్యూబ్ లోనే సినిమా ప్రత్యక్షమవ్వడంతో ‘నాని గాడు’ చిత్రబృందం షాక్ లో ఉంది.