పీసీసీ పోస్ట్’పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్
తెలంగాణ పీసీసీ చీఫ్ మారబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ని అధిష్టానం నియమించబోతుందని టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివాదరహిత రికార్డున్న నాయకులే పీసీసీ చీఫ్ అవుతారని ఆయన అన్నారు.
అంతేకాదు.. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులే వివాదరహితులని.. వారికి ఓటేశారు జగ్గారెడ్డి. వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెడతామన్నప్పటికీ అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మరీ.. వివాదస్పద నేత ఎవరు అంటే.. ? బహుషా.. జగ్గారెడ్డి దృష్టిలో రేవంత్ రెడ్డి అయి ఉంటాడు.
వాస్తవానికి కొద్దిరోజుల క్రితమే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అదిష్టానం ఖరారు చేసింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కలిసి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో గ్రూపు ఫోటో దిగారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ దక్కడానికి వీల్లేదంటూ తీవ్ర నిరసన గళం వినిపించడంతో.. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రకటన ఆగిపోయిందనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా కలిసి టీ-పీసీసీ పోస్ట్ రేవంత్ రెడ్డికి దక్కకుండా గళం విప్పుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. జీవన్ రెడ్డి, శ్రీదర్ రెడ్డిలలో ఒకరికి పీసీసీ పోస్ట్ వచ్చేలా లాబీయింగ్ కూడా మొదలెట్టినట్టు రాజకీయ వర్గాల సమాచారమ్. మరీ.. పీసీసీ పోస్ట్ దక్కపోతే.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారా.. ? లేదంటే ఆర్ఎస్ఎస్ మూలలు ఉన్నాయనే ప్రచారం ఆయన ఎలాగూ ఉంది. బీజేపీలో చేరుతారా ? అన్నది చూడాలి.