2వేల నోటు రద్దుపై కేంద్రం క్లారిటీ

2016లో పెద్ద నోట్లని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 8, 2016న రూ. 500, రూ. 1000నోట్లని కేంద్రం బ్యాన్ చేసింది. నల్లధనం నిర్మూలనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రజలు కొన్నిరోజులు నోట్ల రద్దు కష్టాలని ఎదుర్కొన్నారు. ఐతే, రూ.500, రూ. 1000నోట్లని రద్దు చేసిన ప్రభుత్వం అంతకంటే పెద్ద నోటు రూ. 2000ని తీసుకురావడంపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రూ. 2000నోట్లని రద్దు చేయబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై స్పీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషద్ రాజ్యసభలో అడిగారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇస్తూ.. ఆ ప్రచారంలో నిజంలేదు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు, నకిలీ నోట్లను తొలగించేందుకే గతంలో నోట్ల రద్దు చేశామని చెప్పుకొచ్చారు.