అందురూ.. పాయల్’ని చూపించమంటున్నారట.. !
‘ఆర్ఎక్స్100’తో కుర్రకారుకు పిచ్చేక్కించింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు పాయల్ వైపు చూశారు. కానీ, ఆ మూడుని పాయల్ సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. అదే దారిలో వెళ్లి బోల్డ్ సినిమాలు చేసింది. దీంతో ఆమె పై బోల్డ్ పాప అనే ముద్రపడిపోయింది. ఇప్పుడీ ముద్ర తుడిపేసుకొన్న పోయేలా లేదు.
ఆమెకు మరీ బోల్డ్ తరహా క్యారెక్టర్లే వస్తున్నాయట. గ్లామర్ బాగా ఒలక బోయాలన్న కండీషన్లు పెట్టేస్తున్నారట. ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నందు వల్లే తనకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం లేదని లేటుగా తెలుసుకుందట. ఆమె చేసిన రెండు మూడు బోల్డ్ సినిమాలు విడుదలకు ముందే ‘వెంకీమామ’ లో తీసుకోవడంలో బ్రతికిపోయింది. ఇప్పుడు వెంకీమామ మీదనే పాయల్ ఆశలన్నీ. వెంకీ, నాగచైతన్య కలిసి నటించిన వెంకీమామ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.