పండగ పూట కల్యాణ్ పరువు తీసుకొంటాడా ?

వచ్చే యేడాది సంక్రాంతి బరిలో మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో పాటు కల్యాణ్ రామ్ కూడా నిలబడిన సంగతి తెలిసిందే. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంతమంచివాడవురా’. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే పోటీ ఇవ్వలేకపోతుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇంకేమీ పోటీ ఇస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఎందుకంటే ? అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలకి ప్రతేక పీఆర్ టీమ్ ఉన్నాయి. అవి చురుగ్గా పని చేస్తున్నాయి. కల్యాణ్ రామ్ సినిమాకు అసలు పీఆర్ టీమ్ నే లేదని తెలుస్తోంది. దీంతో.. మంచివాడికి ప్రమోషన్స్ దక్కడం లేదు. కల్యాణ్ రామ్ కూడా సినిమాని పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టారు. 

ఆయన ప్రమోషన్స్ పట్టించుకోవడం లేదు. ఇదీగాక..గుజరాతీ ఫీల్ గుడ్ సినిమాకి ఇది రిమేక్ అని తెలుస్తోంది. మంచి సినిమాను తీసుకుని కళ్యాణ్ రామ్ ఇమేజ్ కోసం ఫైట్లు గట్రా యాడ్ చేసి.. యాక్షన్ సినిమాగా మార్చేసారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. సంక్రాంతి పోరులో కల్యాణ్ రామ్ పవురు పోయేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.