ఏపీ అసెంబ్లీలో సూపర్ సీన్

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుల కాంబినేషన్ భలేగా ఉండేది. ఒకరిపై ఒకరు సటైర్స్ విసురుకుంటూ అసెంబ్లీ సమావేశాలని హీటెక్కించేవారు. ఇప్పుడు చంద్రబాబు-జగన్ కాంబో దాన్ని మించిపోయిందనే చెప్పాలి. గతంలో చంద్రబాబుని నోరు మూసుకొని కూర్చోండి.. కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవరు భయపడరిక్కడ అంటూ సీఎం జగన్ తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇలాంటి సీన్ ఒకటి రిపీట్ అయింది.

‘కుక్క తోక వంకర’ అనే సామెతకు ఎవరైనా ఉదాహరణ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడుగారే అంటూ సీఎం జగన్ రెండు చేతులు జోడించి తనదైన శైలిలో దండపెట్టడం ఆకట్టుకొంది. దానికి చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు. ఎవరిది కుక్క తోక వంకరో త్వరలోనే తెలుస్తుందని చురకలంటించారు. ముందుంది మొసళ్ల పండుగ. ఏడు నెలల సంబరమే ఇది. ముందు ముందు చాలా ఉందంటూ రిప్లై ఇచ్చారు.