అల.. టీజర్ స్టయిల్ గా ఉంది !

త్రివిక్రమ్-అల్లు అర్జున్’ల హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ స్టయిలీష్ గా ఉంది. ‘మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్టు దాచాడు నిన్న అంటూ.. వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది.

ఆ తర్వాత బ్యాక్ లుక్ లో బన్నీ స్టయిలీష్ ఎంట్రీ.. కొన్ని డ్రామా సీన్స్ వచ్చాయి. ఆ తర్వాత బన్నీ యాక్షన్ లోకి దిగాడు. స్టయిలీష్ గా రౌడీలని రఫ్పాడించాడు. స్టయిలీగా ఉంది కదా.. నాకు కూడా నచ్చిందని బన్నీ చెప్పడంతో యాక్షన్ కి పులిస్టాప్ పడింది. ఆ తర్వాత డైలాగ్ మిస్సయిందన్న బన్నీ.. సముద్రఖని తో మీరు ఇప్పుడే కారు దిగారు.. నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా అని చెప్పడం ఆకట్టుకొంది. చివరల్లో సంక్రాంతికి వస్తున్నట్టు చేతిలో సంక్రాంతి పుంజుని పట్టుకొని… మాస్ లుక్ లో కనిపించారు. మొత్తంగా.. అల… టీజర్ అదిరిపోయింది.