చంద్రబాబు అత్తకు న్యాయం చేశాం : జగన్

తెదేపా అధినేత చంద్రబాబు అత్తకు న్యాయం చేశామన్నారు సీఎం జగన్. ఏపీ అసెంబ్లీల్ నామినేటెడ్ పదవుల పంపకాలపై తెదేపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులన్నీ రెడ్లకు ఇచ్చారని, తమ వారికి దోచిపెట్టడమే ఆరోపించారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామని, సగం పదవుల్లో మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.

అంతేకాదు.. చంద్రబాబు అత్తగారికి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బార్య లక్ష్మీ పార్వతీకి కూడా పదవి ఇచ్చాం. మీరు ఇవ్వలేకపోయారని తనదైన శైలిలో సటైర్లు వేశాడు. ఎవరెవరికి ఏ నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నది సీఎం జగన్ చదివి వినిపించారు. ఈ క్రమంలో లక్ష్మీ పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీ పార్వతీ నియమించామని తెలిపారు. 13 డీసీసీబీ చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మునారిటీలు, బీసీలే ఉన్నారని, తెలిపారు.