దిశ నిందితుల్లో ముగ్గురు మైనర్లే.. ఇప్పుడు ఏం జరుగుతుంది ?
దిశ నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ఈనెల 6న జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే.నలుగురి నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నారనే అనుమానాలుండటం.. దానికి సంబంధించిన ఆధారాలు బయటపడటంతో.. ఈ కేసు మరింత సీరియస్ గా మారుతుంది.
ఆదివారం దిశ నిందితుల కుటుంబసభ్యులను విచారించిన ఎన్ హెచ్ ఆర్సీ బృందం మీ కుమారులు మైనర్లయితే ధ్రువపత్రాలు ఇవ్వండని సూచించింది. ఈ నేపథ్యంలోనవీన్ బోనఫైడ్ సర్టిఫికెట్ ను ఎన్ హెచ్ ఆర్సీ బృందం వాట్సాప్ నెంబర్ కి పంపించారు. ఆ బోనఫైడ్ లో నవీన్ పుట్టినతేది 10-04-2004గా ఉంది. దాని ప్రకారం నవీన్ వయసు 15 సంవత్సరాలా 8 నెలలు మాత్రమే. అంతేకాదు.. మరో ఇద్దరు నిందుతుల కూడా మైనర్లుగా ధృవ పత్రాల్లో ఉన్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకి తిప్పలు తప్పేలా లేవు.