జనసేన ఏకైక ఎమ్మెల్యే వైకాపాలోకి.. !

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైకాపాను, సీఎం జగన్ ని సపోర్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ సర్కార్ తీసుకొచ్చిన ‘ఇంగ్లీష్ మీడియం’పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్వతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ మీడియంపై తెదేపా కంటే జనసేననే ఎక్కువ హడావుడి చేసింది.

అయితే, ఇప్పుడు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అసెంబ్లీ సాక్షిగా ఇంగ్లీష్ మీడియం ని సపోర్ట్ చేశారు. అంతేకాదు.. జగన్ సర్కార్ కు సపోర్టుగా మాట్లాడారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. స్పీకర్ పై తెదేపా అధినేత ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని రాపాక తప్పపట్టారు. 

ఈ నేపథ్యంలో త్వరలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వైకాపాలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తుందని చెప్పుకొంటున్నారు. గతంలోనే రాపాక సీఎం జగన్ ని కలిశారు. ఆ సమయంలోనే ఆయన వైకాపా గూటికి చేరుకొంటారనే ప్రచారం జరిగింది. కానీ, రాపాక జనసేనలోనే కొనసాగుతున్నారు. బహుశా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటారేమో.. !