దిల్ రాజు కోరిక తీర్చబోతున్న ప్రభాస్

శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించాలన్నది దిల్ రాజు కోరిక. వాస్తవానికి ‘భారతీయుడు2’ ప్రకటన దిల్ రాజు నిర్మాతగానే జరిగింది. చెన్నైలో జరిగిన ‘భారతీయుడు2’ సినిమా ప్రకటన కార్యక్రమానికి దిల్ రాజు హాజరయ్యారు. స్టేజ్ పై శంకర్, కమల్ హాసన్ కలిసి ఫోటోలు కూడా దిగారు. ఐతే, ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకొన్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ టేకప్ చేసింది.

శంకర్ తో సినిమా చేయాలన్న దిల్ రాజు కోరికని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీర్చబోతున్నట్టు సమాచారమ్. ప్రభాస్ కోసం శంకర్ ఓ కథని రెడీ చేశాడని.. ఆ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కోసం శంకర్ ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడట. ఈ కథను ప్రభాస్ కి వినిపించడం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయట.

ప్రస్తుతం భారతీయుడు 2 తో బిజీగా ఉన్న శంకర్ ఆ తర్వాత విజయ్ తో ఓ సినిమా చేస్తాడని.. ఆ తర్వాత ప్రభాస్-శంకర్ కాంబోలో సినిమా ఉండనుందని చెప్పుకొంటున్నారు. తాపీగా సినిమాలు తీసే శంకర్ ప్రభాస్ దగ్గరకి వచ్చేందుకు ఇంకా చాలానే సమయం పడుతుందని చెప్పవచ్చు.