ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెదేపా ఆందోళన

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెదేపా నేతలు ఆందోళనకి దిగారు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రగా వచ్చారు. అసెంబ్లి వద్ద ఆందోళన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలతో చంద్రబాబు, బాలకృష్ణ, ఇతర నేతలు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి ఒక్కరిపై 50 శాతం భారం వేశారన్నారు. ఛార్జీలు ఎందుకు పెంచారో చెప్పలేక పోతున్నారన్నారు. ఏ ధరలూ పెంచమని అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారన్నారు. రూ.10 బస్‌ టికెట్‌ను రూ.15లకు పెంచేశారన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ యువనేత మంగళగిరి బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపారు. మంగళగిరి నుంచి అసెంబ్లీ వర లోకేశ్‌ సిటీ బస్‌లో పయనించారు.