మహేష్’పై రస్మిక టిక్ టాక్.. సూపర్ !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో రస్మికకి అన్యాయం జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రస్మిక సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం సరిలేరు నుంచి రాబోతున్న మూడో పాటని రస్మిక చేత ప్రమోషన్ చేయిస్తున్నారు.

సోమవారంతో సరిలేరు నుంచి #HeIsSoCute సాంగ్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ పాటపై రస్మిక చేసిన టిక్ టాక్ వీడియో ఒకటి వదిలారు. ఇందులో #HeIsSoCute, #HeIsSoSweet, #HeIsSoSweethandsome అంటూ చిందులేసింది రస్మిక. ప్రస్తుతం సరిలేరు సాంగ్ పై రస్మిక చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ అవుతోంది.