పెద్దోడిని విష్ చేసిన చిన్నోడు

అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అందరి హీరోల ఫ్యాన్స్ విక్టరీ వెంకటేష్’కి అభిమానులు. అవునూ.. వెంకీ అందరివాడు. వెంకీ సినిమా కోసం మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుపాటి.. అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇండస్ట్రీ కూడా వెంకీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఎందుకంటే ? వెంకీ సినిమా చూసి హాయిగా నవ్వుకోవచ్చు. నవ్వు ఒక్కటే కాదు.. వెంకీ ఏడిపిస్తాడు కూడా. 

మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులు మెచ్చిన ఏకైక తెలుగు హీరో. అలాంటి వెంకీ పుట్టినరోజు వచ్చిందంటే.. శుభాకాంక్షలు వెలువెత్తడం సహజమే. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వెంకీని సినీ, సన్నిహితులు, ప్రేక్షకుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకీని ట్విట్టర్ వేదికగా విష్ చేశారు.

మహేష్-వెంకీ కాంబోలో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పెద్దోడు, చిన్నోడుగా ఆకట్టుకొన్నారు వెంకీ, మహేష్. ఇప్పుడు పెద్దోడు బర్త్ డే సందర్భంగా చిన్నోడు విషెస్ చెప్పాడు. రామ్ చరణ్, ఎన్ టీఆర్, యంగ్ హీరోలు, వారి ఫ్యాన్స్ వెంకీని సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.