నాన్సెన్స్’పై చంద్రబాబు వివరణ
తెదేపా అధినేత చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో సహనం కోల్పోయిన సంగతి తెలిసిందే. ‘వాట్ నాన్సెన్స్.. ‘ అంటూ ససహనం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, బాబుని సభ నుంచి డిస్మిస్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా నాన్సెస్ కామెంట్స్ పై చంద్రబాబు అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. అసెంబ్లీకి రానివ్వడం లేదన్న బాధతోనే నాన్సెన్స్ అన్నా. పరుషంగా మాట్లాడటం నాకు రాదన్నారు చంద్రబాబు. అదేసమయంలో అసెంబ్లీలో తనను అడుగడుగునా అవమానిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించేలా పరిపాలన ఉండాలని, కానీ, ఉన్మాది పాలనగా ఉండకూడదని చంద్రబాబు హితవు పలికారు.