ఇటు దిశ బిల్లు.. అటు మరో అఘాయిత్యం !
గుంటూరు నగరంలోని రామిరెడ్డి నగర్ లో మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలికపై ఓ ఇంటర్ విద్యార్థి అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు కూడా నిర్ధారించారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధిత బాలికను గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
అసెంబ్లీలో దిశ బిల్లు ప్రవేశపెట్టి.. ఆమోదం పొందిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరుగడం గమనర్హం. దిశ బిల్లుతో అత్యాచార ఘటనలో నిందితులకి కేవలం 21 రోజుల్లోనే శిక్షని ఖరారు చేయనున్నారు. దిశ బిల్లుకు ప్రతిపక్షం తెదేపా కూడా మద్దతుపలికిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణలో జరిగిన దిశలాంటి దారుణ ఘటన ఏపీలో జరగకూడని ఈ బిల్లుని తీసుకొచ్చారు.