‘వెంకీమామ’ ట్విట్టర్ రివ్యూ

విక్టరీ వెంకటేష్ సింగిల్ వస్తేనే.. ఆ హంగామా మాములుగా ఉండదు. ఈ సారి ఆయన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి.. అదీకూడా బర్త్ డే కానుకగా ‘వెంకీమామ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మామ, అల్లుళ్లు బ్యానర్లు, కటౌట్లతో థియేటర్స్ కలర్ ఫుల్లుగా తయారయ్యాయి. వెంకీ, చైతూల కటౌట్లని ట్రాకర్లపై ఊరిగేంపు, బ్యానర్లకి పాలాభిషేకాలు జరిగిపోతున్నాయి. ఇక థియేటర్స్ లో వెంకీమామ బొమ్మకూడా పడిపోయింది.

ఇప్పటికే బినిఫిట్ షోస్ చూసేసిన ప్రేక్షకులు వెంకీమామ టాక్ ని ట్విట్టర్ వేదికగా పంచుకొంటున్నారు. ఆ విశేషాలని ఓ సారి చూస్తే.. మామ-అల్లుళ్లు అదరగొట్టారని చెబుతున్నారు. ఫస్టాఫ్ వినోదత్మకంగా సాగింది. ఇక సెకాంఢాఫ్ లో ఎమోషన్స్ బాగా పండాయని చెబుతున్నారు. చైతూ ఆర్మీ ఏపీసోడ్ లో అదరగొట్టేశాడు. 

వెంకీ ఆల్ రౌండర్ షో..  కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ తనదైన శైలిలో పండించాడు. చైతూ బాగా చేశాడు. సెకాంఢాఫ్ లో చైతూ నటన హైలైట్ అని చెబుతున్నారు. రాశీఖన్నా నటన బాగుంది. థమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. మొత్తంగా.. వెంకీమామ ఫస్టాఫ్ యావరేజ్, సెకాంఢాఫ్ సూపర్.. ఫైనల్ గా వెంకీమామ బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు.