రివ్యూ : వెంకీమామ
చిత్రం : వెంకీమామ (2019)
నటీనటులు : వెంకటేష్, నాగ చైతన్య, పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా తదితరులు
సంగీతం : థమన్
దర్శకత్వం : కె.యస్ రవీంద్ర (బాబీ)
నిర్మాత : సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల
రిలీజ్ డేటు : 13 డిసెంబర్, 2019
విక్టరీ వెంకటేష్ సింగిల్ వస్తేనే.. ఆ హంగామా మాములుగా ఉండదు. ఈ సారి ఆయన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి.. అదీకూడా బర్త్ డే కానుకగా ‘వెంకీమామ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ చిత్రానికి కె.యస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు. వెంకీకి జంటగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా నటించారు. వెంకీమామ.. నవరసాలతో కూడిన అచ్చ తెలుగు సినిమాని అని చిత్రబృందం ముందు నుంచి చెబుతోంది. మరీ.. నవరసాలు ఏ మోతాదులో ఉన్నాయి. ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకున్నాయి.. తెలుసుకునేందుకు రివ్యూలో వెళదాం పదండీ.. !
కథ :
వెంకటరత్నం నాయుడు (వెంకటేష్)కు అల్లుడు కార్తిక్ శివరామ్ (నాగ చైతన్య) అంటే ప్రాణం. అమ్మనాన్న లేని అల్లుడిని ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుతాడు. అల్లుడి కోసం పెళ్లి కూడా చేసుకోడు. పెళ్లి చేసుకొంటే వచ్చే అమ్మాయి అల్లుడి బాగా చూసుకోదేమోననే భయంతో పెళ్లికానీ ప్రసాదుగానే మిగిలిపోతాడు.
ఇక అల్లుడు కార్తీక్ కి మేనమమ అంటే ప్రాణం. మేనమామే ప్రపంచంగా బతికేస్తుంటాడు. లండన్‌లో ఉద్యోగం వచ్చినా మామయ్యకు దూరంగా వెళ్లడం ఇష్టం లేక ఆ ఉద్యోగాన్ని వదిలేసుకుంటాడు. అదే సమయంలో తమ ఊరికి వచ్చిన హిందీ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్‌పుత్)తో వెంకటరత్నం, క్లాస్‌మెట్ హారిక(రాశీఖన్నా) తో కార్తిక్ ప్రేమలో పడతారు. ఇంతలో మామ-అల్లుళ్లు విడిపోవాల్సి వస్తుంది. దానికి కారణమేంటీ ? కార్తీకి సైన్యంళో ఎందుకు చేరాడు ? అన్నది మిగితా కథ.
ఎలా ఉంది.. ? ఎవరెలా చేశారంటే.. ?
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథని రాసుకొన్నాడు దర్శకుడు బాబీ. ఆ కథని అంతే పక్కగా తెరపైకి తీసుకొచ్చారు. వెంకీ నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో.. అవన్నీ చూపించాడు. అదే సమయంలో చైతూ నటనని హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. ఐతే, ఫైనల్ గా వెంకీదే డ్యామినేషన్. ఫస్టాఫ్ కామెడీ, లవ్ సీన్స్‌తో సరదా సరదాగా గడిచిపోతుంది.
సెకాంఢాఫ్ ని ఎమోషనల్‌గా నడిపించాడు. మామా అల్లుళ్లు దూరమవ్వటం ఆ తరువాత జరిగే పరిణామాలు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌తో కంటతడి పెట్టిస్తాయి. ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నా.. లాజిక్ దూరంగా అనిపిస్తాయి. వెంకీ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ఆయనతో పోటీ పడుతూ అల్లుడు నటించారు. తెరపై మామ-అల్లుళ్లని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సీన్స్ చాలానే ఉన్నాయి.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా గ్లామర్ తో పోటీపడ్దారు. వారికి నటించే స్కోప్ దక్కలేదు. కానీ, ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. నాజర్, ప్రకాష్ రాజ్, రావూ రమేష్, దాసరి అరుణ్, హైపర్ ఆది, విద్యుల్లేఖ రామన్ తదితరులు తమ తమ పరిది మేరకు నటించారు.
సాంకేతికంగా :
మాంఛి ఫాంలో ఉన్న థమన్.. వెంకీమామ కోసం మంచి పాటలు, అంతకంటే మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సీన్స్ లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగుంది. కశ్మీర్ ఏపీసోడ్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. సినిమా ఎంటర్ టైనింగ్ ఉన్నా.. అక్కడక్కడా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ కి కత్తెరపెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
* వెంకీ, చైతూల నటన
* కామెడీ
* భాగోద్వేగాలు
* నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
* అక్కడక్కడ సాగదీత
* కొన్ని లాజిక్ లేని సీన్లు
చివరగా : వెంకీమామ.. నవ్వించి.. ఏడిపిస్తాడు !
రేటింగ్ : 3/5