నితిన్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరో తెలుసా ?

యంగ్ హీరో నితిన్ పెళ్లి ఫిక్సయింది. వచ్చే యేడాది ఏప్రిల్ లోనే నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నట్టు సమాచారమ్. దుబాయ్ లో నితిన్ పెళ్లిని ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారమ్. పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులని మాత్రమే ఆహ్వానిస్తారంట. ఇంతకీ నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ?

కొన్నాళ్లుగా నితిన్ ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో ఉన్నారట.. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అమ్మాయి ఎవరు ? ఆంధ్రానా.. తెలంగాణనా ? ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా.. ?? అనే వివరాలేవీ బయటికి రాలేదు.

ప్రస్తుతం ‘భీష్మ’ సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక కథానాయిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.