దగ్గుబాటి అభిమానులకి మరో బర్త్ డే గిఫ్ట్

ఈ వారం దగ్గుబాటి అభిమానులు పండగ చేసుకొంటున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) విక్టరీ వెంకటేష్ బర్త్ డే. వెంకీ బర్త్ డే కానుకగా ‘వెంకీమామ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెంకీ, ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటించిన చిత్రమిది. తెరపై మామ-అల్లుళ్ల సందడిని చూసి దగ్గుబాటి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇక ఇవాళ (డిసెంబర్ 14) రానా దగ్గుబాటి బర్త్ డే. ‘లీడర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా.. ఎన్నో విభిన్న పాత్రాల్లో నటించి, టాలీవుడ్ భల్లాలదేవుడిగా పేరు తెచ్చుకున్నారు. రానాకి బాషతో సంబంధం లేదు. ఎక్కడ వైవిధయమైన పాత్ర దొరికితే.. అక్కడవాలిపోతాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. లోనూ రానాకి మంచి గుర్తింపు ఉంది. పుట్టినరోజు కానుకగా ‘విరాటపర్వం’ నుంచి రానా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అని పోస్టర్ పై రాసి ఉంది. ఇందులో రానా ముఖానికి ఓ ఎర్రటి క్లాత్ కట్టుకుని కనిపించారు. 

ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానాకు జంటగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నక్సలైట్ గా కనిపించనున్నారని సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేశ్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.