‘వెంకీమామ’ ఫస్ట్ డే లెక్కెంత ?

కె.యస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా కథానాయికలు. వెంకీ బర్త్ డే  కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వెంకీమామ’ హిట్ టాక్ సొంతం చేసుకొంది. వెంకీమామ కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

అదేసమయంలో వెంకీమామ ఎమోషన్స్ ని టచ్ చేశాడని చెప్పుకొంటున్నారు. ఇక మామ-అల్లుళ్లని తెరపై చూసుకొని దగ్గుబాటి, అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు. అంచనాలకి తగ్గట్టుగానే వెంకీమామ తొలిరోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెంకీమామ తొలిరోజు రూ. 7.02కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏరియాలవారీగా చూస్టే.. !

నైజాం రూ.2.29కోట్లు, సీడెడ్ రూ.1.60కోట్లు, ఉత్తరాంధ్ర  రూ.0.87 కోట్లు, ఈస్ట్ రూ.0.60కోట్లు, వెస్ట్ రూ.0.30 కోట్లు, కృష్ణ రూ.0.37 కోట్లు, గుంటూరు రూ.0.72కోట్లు, నెల్లూరు రూ.0.27కోట్లు, మొత్తం ఏపి&తెలంగాణ మొదటిరోజు షేర్ రూ.7.02 కోట్లు కలెక్ట్ చేసింది. వచ్చేవారం బాలయ్య రూలర్, సాయితేజు ప్రతిరోజూ పండగే సినిమాలు రిలీజ్ కానున్నాయి. అప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర వెంకీమామ హవా కొనసాగనుంది. అంతేకాదు.. సంక్రాంతి వరకు వెంకీమామ హవా చూపించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.. !