వర్మపై పంతం నెగ్గించుకున్న కేఏ పాల్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంతం నెగ్గించుకున్నారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫోటో మార్పింగ్ చేసి తనకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ప్లాప్ ని కేఏ పాల్ ఎంజాయ్ చేశారు.
చూశారా.. ? వర్మ పాపం పడింది. ఆయన సినిమా ప్లాప్ అయింది అంటూ ఓ వీడియోని విడుదల చేశారు కేఏ పాల్. సినిమాలో నా పేరు, నా పాత్ర లేకుండా చేశాను. ఇక్కడితో వర్మని వదిలిపెట్టను. రేపు పోలీస్ స్టేషన్ లో వర్మ సంగతి తేలుతుంది అన్నారు. అన్నట్టుగానే.. రేపు వర్మని పోలీస్ స్టేషన్ కి ఈడ్చనున్నారు. వర్మపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రేపు ఉదయం విచారణకు హాజరుకావాలని వర్మకు నోటీసు ఇచ్చారు.
అమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కేఏ పాల్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఫొటోలు, వీడియోలను వర్మ మార్ఫింగ్ చేసి వాడరని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో వర్మపై కేసు నమోదైంది. మరీ.. రేపు వర్మ పోలీస్ స్టేషన్ హాజరవుతారా.. ? అన్నది చూడాలి. వర్మ పోలీస్ స్టేషన్ కి వస్తే.. ఆయన్ని విచారించి వదిలేస్తారా ? లేదంటే అక్కడే అరెస్ట్ చేస్తారా ?? అన్నది చూడాలి.