ఎమ్మెల్యే రజనీపై అభ్యంతరకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్ ! 

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే రజనీపై సోషల్ మీడియాలో కొంతకాలంగా అభ్యంతరకర పోస్టులు కనిపిస్తున్నాయి. దీనిపై చిలకలూరిపేటకు చెందిన వైకాపా నేత మారుబోయిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యే రజనీపై అభ్యంతరక పోస్టులు పెట్టిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన సత్యవోలు హరిప్రసాద్ రెడ్డి అలియాస్ సత్యంరెడ్డి… ఎమ్మెల్యే రజనీ ఫొటోపై ఫేస్ బుక్ లో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్టింగ్ పెట్టాడు. దాని కింద అదే జిల్లా రాపూరు మండలం కండలేరు డ్యాంకు చెందిన పంతగాని ప్రవీణ్ అసభ్యకర కామెంట్స్ పెట్టాడని నాగరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీరిద్దరు టీడీపీ సానుభూపతి పరులని తెలుస్తోంది. వీరిపై 509 ఐపీసీ, సెక్షన్ 67 ఐటీ యాక్ట్-2008 కింద ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఆదివారం వారి స్వగ్రామాల్లో సత్యంరెడ్డి, ప్రవీణ్ ను అరెస్టు చేసి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.