‘దర్భార్’ ట్రైలర్ టాక్  

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘దర్బార్‌’. నయనతార కథానాయిక, సునీల్ శెట్టి, ప్రకాశ్‌రాజ్‌, నివేదా థామస్‌, యోగిబాబు, హరీష్‌ ఉత్తమన్‌, మనోబాలా, ఆనంద్‌రాజ్‌, శ్రీమన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లైకా సంస్థ నిర్మించింది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న దర్భార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో రజనీ అరుణాచల్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయ్. మధ్య మధ్యలో నయనతారతో రజనీ రొమాంటిక్ లుక్స్ ఆకట్టుకొన్నాయి. విలన్ సునీల్ శెట్టి, రజనీల మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయ్. స్టోరీ లైన్ లీక్ చేయడకుండా రజనీ మార్క్ స్టయిలీష్ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. దర్భార్ టైలర్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !