చంద్రబాబు రివర్స్ గేర్
రివర్స్ లో వెళ్లయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిసైడ్ అయినట్టున్నాడు. ఇవాళ రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై టీడీపీ వినూత్నంగా ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. వెనక్కి నడుస్తూ నిరసన తెలియజేశారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేశారు.
అసెంబ్లీలోనూ రివర్స్ టెండింగ్ పై తెదేపా నేతలు ప్రభుత్వాన్ని నిరదీశారు. ఐతే, తెదేపా హయాంలో అవినీతి కారణంగానే రివర్స్ టెండరింగ్ కి వెళ్లామని మంత్రి బొత్స అసెంబ్లీ తెలిపారు. రివర్స్ గేర్ వెళ్లిన రివర్స్ టెండరింగ్ లో తెదేపా ప్లాన్ వర్కవుట్ కాలేదు. దీంతో.. మిగితా అంశాలు.. ఉల్లి ధరలు, రైతుల సమస్యలు, 2430 జీవో, ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది. మొత్తానికి ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాటు హాటుగా సాగుతున్నాయి.