తిరుపతిలో పాయల్ సందడి


హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తిరుపతిలో సందడి చేశారు. తిరుపతిలో హట్‌స్పాట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైంది. పాయల్ రాక గురించి ముందే తెలుసుకున్న తిరుపతి ప్రజలు ఆమెని చూసేందుకు భారీగా తరలివచ్చారు. పాయల్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాయల్… తిరుపతికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను నటించిన ‘వెంకీ మామా’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు.

ఇక వెంకీమామ హిట్ తో పాయల్ పై ఉన్న బోల్డ్ హీరోయిన్ ముద్రపోయినట్టేనని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పాయల్ ‘డిస్కో రాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు. వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రమిది. వచ్చే యేడాది జనవరి 24న డిస్కో రాజా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.