అఫిషియల్ : ‘చిరు పక్కన త్రిష’నే !

చిరు152 సినిమా హీరోయిన్ విషయంలో సస్పెన్స్ వీడింది. చిరు పక్కన త్రిష ఖరారైంది. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది జనవరిలో రెగ్యూలర్ షూటింగ్ మొదలెట్టి.. ఆగస్టులో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ కోసం చాలామంది ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చాయి. నయనతార, అనుష్క, శృతిహాసన్, ఈషా రెబ్బా.. త్రిష పేర్లు వినిపించాయి.

చిరు పక్కన త్రిష దాదాపు ఖరారైనట్టేనని చెప్పుకొన్నారు. ఐతే, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారక ప్రకటన రాకపోవడంతో మెగా అభిమానుల్లో కన్పూజన్ ఏర్పడింది. తాజాగా, ఆ కన్ఫూజన్ తెరదించుతూ.. చిరు సినిమాలో నటిస్తున్నట్టు త్రిష ట్విట్ చేసింది. అది కూడా నేరుగా కాదు. సినీ విశ్లేషకుడు రమేష్ బాల త్రిష వచ్చే యేడాది నటించబోయే చిత్రాల లిస్ట్ ఒకటి ట్విట్ చేశారు. దాంట్లో చిరు 152 చిత్రం కూడా ఉంది. దాన్ని త్రిష రీ ట్విట్ చేసింది. దాంతో చిరు పక్కన త్రిష ఖరారైనట్టయింది.

ఇక ఈ సినిమా కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో ఉండనుందని తెలుస్తోంది. ఇందులో చిరు ప్రభుత్వు ఉద్యోగిగా కనిపిస్తారని.. ఓ సామాజిక అంశాన్ని తెరపై చూపిస్తారని చెప్పుకొంటున్నారు. ఈ సినిమా కోసం చిరు కొత్త లుక్ లోకి మారిపోయాడు. దానికి సంబంధించిన పిక్ ఒకటి బయటికొచ్చింది. వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. మణి శర్మ, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్‌ ల కోసం రెండు వారల క్రితం బ్యాంకాక్‌ కు వెళ్లి వచ్చారు.