ఉన్నావ్ కేసు : ఎమ్మెల్యే సింగూర్’ని దోషిగా తేల్చిన కోర్టు

ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత నేత కులదీప్ సింగ్ సెంగార్‌ను ఢిల్లీ తీస్ హజారీ కోర్టు దోషిగా తేల్చింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 376(1), లైంగిక దాడుల నుంచి బాలల రక్షణ(పోస్కో) చట్టంలోని 5(సీ), 6 సెక్షన్ల కింద సెంగర్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ నెల 19న కులదీప్‌కు తీస్ హజారీ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.

2017 జూన్ 4న ఉద్యోగం ఇప్పించాలని అడగడానికి ఎమ్మెల్యే కులదీప్ సెంగర్ ఇంటికి వెళ్లిన ఓ మైనర్ బాలికని.. ఆయన అత్యాచారం చేశారని కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత ఎమ్మెల్యే నుంచి బాధితురాలి కుటుంబానికి పలుమార్లు బెదిరింపు, పోలీసులు కేసులు పెట్టారు.

బాధితురాలు తన పిన్ని, అత్త, వకీలుతో రాయ్‌బరేలీ వెళ్తున్న సమయంలో. వారు ప్రయాణిస్తున్న డిజైర్ కారును 12 చక్రాల ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో బాధితురాలి పిన్ని, అత్త మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆమె లాయర్ కు లఖ్‌నవూలోని కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుని ఆగస్టు 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టారు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ.. సోమవారం తుదితీర్పుని వెల్లడించారు.