నేడే.. ‘ఉన్నావ్ కేసు’ తుది తీర్పు !

ఉన్నావే కేసులో ఢిల్లీ కోర్టు నేడు తుది తీర్పుని వెల్లడించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు తీర్పు వెలువడనుంది. 2017లో ఒక మైనర్‌ బాలికపై బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్దిప్‌ సెంగార్‌ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి.

అంతేకాదు..  ఈ ఏడాది జూలై నెలలో బాధితురాలు తన కుటుంబ సభ్యులు, న్యాయవాదితో కలిసి రాయ్‌బరేలి నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఒక ట్రక్కు ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు మృతి చెందారు.

ఈ ప్రమాదం వెనక ఎమ్మెల్యే సింగార్ హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ అత్యాచార ఘటనలో ఢిల్లీ కోర్టు ఎలాంటి తీర్పునివ్వనుంది అనే ఆసక్తి నెలకొంది. ప్రజా ప్రతినిధి అయినా.. సరైన శిక్ష విధిస్తే న్యాయస్థానాలపై మరింత మర్యాద పెరగనుందని అంటున్నారు.