మూడు రాజధానుల ఏర్పాటు.. తుగ్లక్ చర్య !

ఏపీ రాజధాని అమరావతి మార్పు అంశాన్ని సీఎం జగన్ తేల్చేశారు. ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్టు మంగళవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అధికారిక విభజన మంచి నిర్ణయం. దక్షిణాఫ్రికా తరహా ఏపీలోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయొచ్చన్నారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక అందజేయనుంది. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఉండొచ్చన్నారు సీఎం జగన్.

మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఇదో తుగ్లక్ నిర్ణయం అన్నారు. అమరావతిలో ఉన్న సీఎం జగన్.. కర్నూలు, విశాఖలకి వెళ్తారా ? అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రజల నుంచి మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనపై హర్షం వ్యక్తం అవుతుంది. వైజాగ్ లో రాజధాని ఏర్పాటయితే.. అభివృద్ధి జరుగుతుందని, అలాగే కర్నూలులో కూడా అభివృద్ది అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.