ఢిల్లీకి దిశ నిందితుల మృతదేహాలు.. ఎందుకంటే ?

హైదరాబాద్ శంషాబాద్ వద్ద వెటర్నరీ డాక్టర్ దిశని నలుగురు క్రూరులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. దిశ నిందితులని వారం తిరక్కుండానే తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దానికి కారణం సీన్ రీ-కన్ స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన నిందితులు పోలీసులపై తిరగబడటమేనని పోలీసులు తెలిపారు. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అయింది.

మరోవైపు, ఈ ఎన్ కౌంటర్ పై ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవహక్కుల అధికారులు దర్యాప్తు చేసుకొని వెళ్లారు. ఇక ఎన్ కౌంటర్ జరిగిన రాత్రే నిందితుల అత్యక్రియలు నిర్వహించాలనే ప్రయత్నాలు చేశారు. కానీ, హైకోర్టు ఆదేశాలతో అంత్యక్రియలని వాయిదా వేశారు. మృతదేహాలని ముందుగా మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి భద్రపరిచారు. ఇంకా కొన్నిరోజులు మృతదేహాలని భద్రపరచలేమని గాంధీ ఆసుపత్రి వర్గాలు చేతులెత్తాశాయి. ఇప్పటికే మృతదేహాలు కుళ్లిపోవడానికి వచ్చాయని వారంటున్నారు.

ఈ నేపథ్యంలో దిశ నిందితుల మృతదేహాలని ఢిల్లీకి తరలించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడ నీమ్స్ లో ఎన్నిరోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉన్నది. అక్కడ మృతదేహాలను ఎన్ని రోజులు పెట్టినప్పటికీ కూడా వాటికీ ఎలాంటి నష్టం జరగదని గాంధీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. మరీ.. అందుకు కోర్టు అనుమతిని ఇస్తుందా ? అన్నది చూడాలి. ప్రస్తుతం దిశకేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దిశ నిందితుల మృతదేహాలని మరికొన్నాళ్లు భద్రపరచాల్సి వస్తుంది.