పాక్ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ కోర్టు తీర్పునిచ్చింది. దేశద్రోహం కేసులో ముషార్రఫ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ముషార్రఫ్‌కు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పింది.
2013లో ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదైంది. 2014లో ఈ కేసుకు సంబంధించిన స్పెషల్ కోర్టుకు అన్ని ఆధారాలను ప్రాసిక్యూషన్ అందించింది. 2016లో ముషారఫ్ పాకిస్థాన్ ను వదిలి వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని పాక్ కోర్టు ముషారఫ్ కు పలుమార్లు సమన్లను జారీ చేసింది. అయినా ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు.
దీంతో.. ఆయన్ని పరారీలో ఉన్న వ్యక్తిగా పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్, అప్పుడప్పుడు లండన్ లో కూడా తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ముషారఫ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతున్నారు. తాజాగా పాకిస్థాన్ కోర్టు ఆయనకి ఉరిశిక్షని ఖరారు చేసింది.