మద్యం ధరలు పెంచడం వెనక భారీ కుంభకోణం : రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరోసారి మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. 10 శాతం ధరలని పెంచారు. ఐతే, తాజా ధరల పెంపు వెనక భారీ కుంభంకోణం ఉందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన బహిరంగా లేఖ రాశారు. మద్యం ధరలు పెంచడం వెనుక కేఎస్టీ (కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్) మాఫియా ఉందన్నారు.
తెలంగాణలో ఏం చేయాలన్నా 6 శాతం కమీషన్ చెల్లించాల్సిందేనని ఆరోపించారు. తాజాగా మద్యం ధరల పెంపు వ్యవహారం ఆషామాషీగా తీసుకున్నది కాదని.. ఇదో పెద్ద కుంభకోణం రేవంత్ తెలిపారు. ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీల్లో బేరసారాలు జరిపి ఈ ఒప్పందం కుదిర్చారని రేవంత్ వివరించారు. ఉత్పత్తి వ్యయం కంటే 1000 శాతం అధికంగా ధరలు నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు.